SRD: సింగూరు ప్రాజెక్టుకు వరద పెరిగింది. నీటిపారుదల శాఖ అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 14,563 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 19,107క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ 29.827టీఎంసీలు.