WGL: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల వల్ల నష్టపోయిన బాధితులకు కురవి మండలంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి హాజరయ్యారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవడం మంచి కార్యక్రమం అని ఆయన అన్నారు.