MNCL: తాండూర్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేశారు. పలు గ్రామాల ప్రజలు అవసరాల కోసం అండర్ బ్రిడ్జి లోపల నుండి వచ్చి వెళుతుంటారని తెలిపారు. వర్షం పడితే అండర్ బ్రిడ్జి నీటితో నిండిపోయి రాకపోకలు నిలిచిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు.