WGL: నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని నర్సంపేట టౌన్ సీఐ రఘుపతి రెడ్డి హెచ్చరించారు. నర్సంపేట బస్టాండ్ సెంటర్లో గురువారం సీఐ తన సిబ్బందితో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 11 వాహనాలను సీజ్ చేశారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాలను నివారణకు సహకరించాలని కోరారు.