NRPT: నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన ఆశప్ప కొడుకు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డిని కోరారు. దీంతో ఆమె ప్రభుత్వం నుండి మంజూరైన 5 లక్షల ఎల్ఓసి పత్రాన్ని గురువారం బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.