NRPT: జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రపంచ ఫార్మసిస్ట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న ఫార్మసిస్ట్లకు శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లా వైద్య శాఖ అధికారి సౌభాగ్య లక్ష్మీ మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో వైద్యులు ఎంత కీలకమో ఫార్మసిస్ట్లు అంతే కీలకమని అన్నారు.