పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి మార్గాలను చూపేందుకు 7న సమీకృత జిల్లా కలెక్టరేట్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు.100% ఉద్యోగ హామీతో అందించే కోర్సుల గురించి ఈ సదస్సులో వివరించనున్నట్లు తెలిపారు. ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పిస్తామన్నారు.