HYD: గాంధీ ఆసుపత్రి ఆవరణలో మరో గుర్తుతెలియని డెడ్ బాడీ లభ్యమైంది. ఆసుపత్రి ఆవరణలో కిందపడి ఉన్న దాదాపు 45ఏళ్ల గుర్తుతెలియని మహిళా డెడ్ బాడీని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే డెడ్ బాడీ వద్ద ఎలాంటి వివరాలు లేకపోవడంతో బాడీని మార్చురీకి తరలించి భద్రపరిచారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.