SRD: 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలు పటాన్చెరులోని మైత్రి గ్రౌండ్లో ఘనంగా శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని చెప్పారు. ఈనెల 28వ తేదీ వరకు ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి క్రీడలు జరుగుతాయని పేర్కొన్నారు.