MLC Kavita: జగిత్యాల(Jagitiyala)లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavita) అస్వస్థతకు గురయ్యారు. రాయికల్ మండలం ఇటిక్యాలో రోడ్డు షోలో పాల్గొన్న కవిత ప్రచార వాహానంలో సృహతప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తం అయిన పార్టీ కార్యకర్తలు సపర్యలు చేయడంతో కాసేపటికి కోలుకున్నారు. అనంతరం ప్రచారం ప్రారంభించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండడంతో జాతీయ స్థాయి నేతలంతా రాష్ట్రం పై ఫోకస్ పెట్టారు. అగ్ర నేతలంతా ప్రచారం నిమిత్తం రాష్ట్రంలోనే తిష్ఠ వేశారు.