పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 'హిట్ టీవీ'తో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన సొంత నియోజకవర్గం పాలకుర్తిలో 70 వేల మెజారిటీతో గెలుస్తా అన్నారు. మరిన్ని విషయాలను పంచుకున్నారు.
Minister Errabelli Dayakar Rao Exclusive Interview Elections 2023
Errabelli Dayakar Rao: తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తుందని పంచాయతీ రాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) అన్నారు. పాలకుర్తి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు ఇచ్చానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి, టెక్స్టైల్ పార్క్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, తండాలను గ్రామ పంచాయితీలుగా చేశామని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టనివి కూడా చాలా అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. ఒకప్పుడు పాలకుర్తి ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో అందరూ చూస్తున్నారు. ప్రజలు కచ్చితంగా తమవైపే ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా రాష్ట్రంలో ఏం చేస్తుంది అని అడిగారు. మహిళల కోసం ప్రత్యేకంగా చేసిన పనులను తెలిపారు. యువత కోసం ఏం చేశారో తెలిపారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. మంత్రి దయాకర్ రావు చేసిన అభివృద్ధి పనులు ఏంటో తెలుసుకోవాలంటే ఈ పూర్తి వీడియో చూడండి.