వివో తన ప్రీమియం మొబైల్ X90 Pro Plus ఫీచర్లు, ధర వివరాలను రివీల్ చేసింది. ఈ మొబైల్ భారత మార్కెట్లోకి మే 10వ తేదీన వచ్చే అవకాశం ఉంది. ధర రూ.74,390 వరకు ఉండే అవకాశం ఉంది.
vivo X90 Pro Plus:వివో (vivo) తన ప్రీమియం మొబైల్ X90 Pro Plus ఫీచర్లు, ధర వివరాలను రివీల్ చేసింది. ఈ మొబైల్ భారత మార్కెట్లోకి మే 10వ తేదీన వచ్చే అవకాశం ఉంది. ధర రూ.74,390 వరకు ఉండే అవకాశం ఉంది. మొబైల్ (mobile) లుక్ ప్రీమియం కనిపిస్తోంది. 6.78 ఇంచుల ఆమోలెడ్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 మీద మొబైల్ రన్ అవుతుంది.
లీయన్ బ్యాటరీ కాగా సామర్థ్యం 4700 ఎంఏహెచ్ ఇచ్చారు. వైర్ లెస్ చార్జింగ్ (wireless charging) ఉంది. 80 వాట్స్ కెపాసిటీతో క్విక్ చార్జింగ్ (quick charging) అవుతుంది. 0 నుంచి 100 శాతం చార్జీంగ్ 33 నిమిషాల్లో అవుతుంది. ఈ మొబైల్లో 5జీకి డ్యుయల్ సిమ్స్ (dual sims) పనిచేస్తాయి. కర్వ్డ్ డిస్ ప్లే ఉంది. యూత్, టెకీస్ ఈ మొబైల్ అంటే లైక్ చేస్తారు. ఫీచర్ల బట్టి సేల్స్ కూడా ఉంటాయని కంపెనీ చెబుతోంది.