Oneplus: వన్ ప్లస్ నుంచి కొత్త ట్యాబ్.. ఫీచర్స్ ఇవే!
ప్రస్తుతం మొబైల్, ప్యాడ్లు వంటి వాడకం ఎక్కువగా పెరుగుతుంది. దీని కోసం పలు మొబైల్ కంపెనీలు కొత్త ఫీచర్స్‌తో ప్రొడక్ట్స్ విడుదల చేస్తున్నారు. వన్‌ప్లస్ కంపెనీ విడుదల చేయనున్న వన్‌ప్లస్ గో ట్యాబ్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.
Oneplus: వన్‌ప్లస్ మొబైల్ కంపెనీ మార్కెట్లో తనకంటూ ఒక ఇమేజ్ను సంపాదించుకుంది. టాప్ బ్రాండ్‌గా ఉన్న వన్‌ప్లస్ కొత్త కొత్త ఫీచర్స్‌తో ప్యాడ్లు, మొబైల్ ఫోన్స్ తీసుకొస్తుంది. వన్‌ప్లస్ ప్యాడ్ గో పేరుతో తాజాగా ఒక కొత్త ట్యాబ్లెట్ తీసుకువచ్చింది. ఈ ట్యాబ్లెట్ ధర రూ.19,999 మాత్రమే. ఇంత తక్కువ ధరకి 2.4k స్క్రీన్‌తో వన్‌ప్లస్ తీసుకొచ్చింది. మరి ఈ ట్యాబ్ ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం. పదండి.
మార్కెట్లో వన్‌ప్లస్ ప్యాడ్ గో మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999. ఇది వైఫైతో పనిచేస్తుంది. 8జీబీ+12జీబీ ఎల్టీఈ(LTE) వేరియంట్ రూ.21,999లకు, 8జీబీ+256జీబీ ఎల్టీఈ(LTE) వేరియంట్ రూ.23,999లకు లభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్యాడ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ వెబ్సైట్లతో పాటు రిలయన్స్, క్రోమా వంటి ఆఫ్‌లైన్ స్టోర్లలో అక్టోబర్ 20 నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రీ ఆర్డర్లు అక్టోబర్ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రీ ఆర్డర్‌పై రూ.2వేలు బ్యాంక్ డిస్కౌంట్ ఉండటంతోపాటు రూ.1399ల ప్యాడ్ గో ఫోలియో కవర్ కూడా ఉచితంగా ఇస్తున్నట్లు వన్‌ప్లస్ కంపెనీ తెలిపింది.
2.4k రిజల్యూషన్ ఉన్న ఈ వన్‌ప్లస్ ప్యాడ్‌కి 11.35 అంగుళాల డిస్ప్లే అమర్చారు. 7:5 రేషియోతో 90Hz రిఫ్రెష్ రేటు కలిగిన డిస్ప్లే ఇది. అలాగే 400 నిట్స్ అడాప్టివ్ బ్రైట్‌నెస్‌తో వస్తున్న ఈ ప్యాడ్‌కి 8000mAh బ్యాటర్‌ని అమర్చారు. 514 గంటలు స్టాండ్‌బై టైమ్, 40 గంటలు మ్యూజిక్ ప్లే బ్యాక్‌తో ప్యాడ్ వస్తుందిఒక వేరియంట్ వైఫైతో ఉపయోగించుకుంటే మిగతా రెండు వేరియంట్లను 4జీ సిమ్‌కార్డుతో వినియోగించుకోవచ్చు. అలాగే మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజీని 1TBకి కూడా పెంచుకోవచ్చు.