Nothing Phone 2:వన్ ప్లస్ కంపెనీలో పనిచేసి.. సొంతంగా నథింగ్ ఫోన్ (Nothing Phone) కంపెనీని కార్ల్ పే ఏర్పాటు చేశారు. మొబైల్ బ్లాక్ ఎలా ఉంటుందో కస్టమర్లకు తెలిసేలా ఆవిష్కరించారు. ఈ మొబైల్‌కు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) లాంచ్ చేసిన తర్వాత.. ఇప్పుడు నథింగ్ ఫోన్-2 లాంచ్ కాబోతుంది.
Nothing Phone 2:వన్ ప్లస్ కంపెనీలో పనిచేసి.. సొంతంగా నథింగ్ ఫోన్ (Nothing Phone) కంపెనీని కార్ల్ పే ఏర్పాటు చేశారు. మొబైల్ బ్లాక్ ఎలా ఉంటుందో కస్టమర్లకు తెలిసేలా ఆవిష్కరించారు. ఈ మొబైల్‌కు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) లాంచ్ చేసిన తర్వాత.. నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ స్టిక్-1, ఇయర్ స్టిక్-2 కూడా లాంచ్ చేశారు. ఇప్పుడు నథింగ్ ఫోన్-2 లాంచ్ కాబోతుంది.
నథింగ్ ఫోన్-2 (Nothing Phone 2) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మేరకు ఉంటుందట. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్‌తో నథింగ్ ఫోన్ 2 వస్తుందని.. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో కార్ల్ పే తెలిపారు. ఆమోలెడ్ డిస్ ప్లే.. 120 హెచ్‌జెడ్ మాక్సిమమ్ రీప్రెష్ రేట్ కానుంది.
12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరెజ్ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ ఇచ్చారు. కెమెరా వివరాలు (camera).. ధర (rate) వివరాలు తెలియరాలేదు. ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నథింగ్ ఫోన్ చూడటానికి కూడా కొత్తగా ఉంది. జనం నుంచి చక్కగా రియాక్షన్ వచ్చింది. సేల్స్ కూడా బాగానే జరిగాయి. ఈ కామర్స్ స్టోర్ ప్లిప్ కార్ట్.. నథింగ్ మొబైల్స్.. ఇతర ప్రాడక్ట్స్ సేల్ చేస్తోంది.