»Infosys Sweet Talk To It Employees One Lakh Shares Free
Infosys : ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ తీపి కబురు..ఏకంగా లక్షల షేర్లు ఫ్రీ!
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు భారీ కానుక ప్రకటించింది. రూ.64 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. ఈ మేరకు 5,11,862 ఈక్విటీ షేర్ల(Equity shares)ను కేటాయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.ఐటీ కంపెనీల్లో పనిచేసే వారికి బోనస్, ఇన్సెంటివ్స్ మాత్రమే కాదు.. చాలా వరకు కంపెనీలు ఈక్విటీ షేర్లను కూడా ఇస్తుంటాయి.
ఐటీ ఉద్యోగుల (IT employees)కుఇన్ఫోసిస్ గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఐటీ కంపెనీల్లో అంటే మంచి జీతం, 5 రోజుల పని, ఇతర ప్రోత్సాహకాలు అన్నీ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇంకా ఐటీ కంపెనీలు బోనస్, ఇన్సెంటివ్స్(Incentives) మాత్రమే కాకుండా.. షేర్లను కూడా ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ కింద ఇస్తుంటాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్.. అర్హులైన ఉద్యోగులకు ఏకంగా 5.11 లక్షల వరకు షేర్లను కేటాయించింది. రెండు ఉద్యోగ సంబంధిత పథకాల కింద మే 12న షేర్లకు సంబంధించిన కేటాయింపు పూర్తి చేసింది. ఈ రెండు స్టాక్ ఆప్షన్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. కంపెనీలో ఉద్యోగుల ఓనర్షిప్(Ownership)ను పెంచుకోవడం కాగా.. మరొకటి ఉద్యోగుల పనితీరుకు ప్రతిఫలంగా కూడా ఈ షేర్లను కేటాయించడం చేస్తోంది ఇన్ఫీ.
ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ (Expanded) స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రామ్ 2019 ఉద్దేశం ఈ పనితీరు ఆధారిత స్టాక్ గ్రాంట్ ప్రోగ్రామ్ ద్వారా కీలక ప్రతిభను ప్రోత్సహించడం, నిలుపుకోవడం, ఆకర్షించడం. అలాగే కంపెనీలో ఉద్యోగుల యాజమాన్యాన్ని విస్తరించడం. ఇన్ఫోసిస్ ఉద్యోగులందరూ ప్లాన్లో పాల్గొనడానికి అర్హులు. ఈ ప్లాన్ కింద నిరోధిత స్టాక్ యూనిట్ల మంజూరు కోసం ఉద్యోగుల అర్హతను వారి స్థాయి, పనితీరు, ఇతర ప్రమాణాల ఆధారంగా కంపెనీ నిర్ణయిస్తుంది.ఇన్ఫోసిస్ (Infosys) ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రామ్ 2019 కింద ఇవ్వబడిన నిరోధిత స్టాక్ యూనిట్ వెస్టింగ్ వ్యవధి అవార్డు తేదీ నుంచి కనిష్టంగా సంవత్సరం, గరిష్టంగా మూడేళ్ల వరకు ఉంటుంది. ఉద్యోగి( employee)ని తొలగించినప్పుడు లేదా రాజీనామా చేసిన సందర్భంలో వెస్టింగ్ ప్రమాణాలు సంతృప్తి చెందకపోతే సంబంధిత అవార్డు ఒప్పందం కింద మంజూరు చేసిన నియంత్రిత స్టాక్ యూనిట్లు రద్దు అవుతాయని కంపెనీ తెలిపింది.