ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన ఓ జంట సూసైడ్ చేసుకున్నారు. స్నేహితుడి రూమ్ లో ఆ ప్రేమజంట ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్ (Hyderabad) కూకట్పల్లి హాసింగ్ బోర్డులో విషాదం జరిగింది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.పశ్చిమగోదావరి జిల్లా భీమవరం (Bhimavaram) సమీపంలోని గొల్లవానితప్పకు చెందిన శ్యామ్ (24) అదే గ్రామానికి చెందిన జ్యోతి (22)ని ప్రేమించాడు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో… ఇద్దరు 20 రోజుల క్రితం ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ కు వచ్చారు. జ్యోతి కేపీహెచ్‌బీ (KPHB)లోని ఓ ప్రైవేటు హాస్టల్ ఉంటోంది. శ్యామ్ (Shyam)కేపీహెచ్బీలో తన ఫ్రెండ్ కృష్ణ రూమ్ లో ఉంటున్నాడు. కృష్ణ ఇటీవల ఊరికి వెళ్లడంతో.. శ్యామ్ గది తాళాలు తీసుకుని అక్కడే ఉంటున్నాడు. ఇటీవల శ్యామ్ ఉంటున్న రూమ్‌కు జ్యోతి (Jyothi) కూడా వచ్చింది. సోమవారం ఉదయం నుంచి గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా… శ్యామ్ ఉరివేసుకుని ఆత్మహత్య(suicide)కు పాల్పడగా, జ్యోతి విషం తాగి సూసైడ్ చేసుకున్నట్లు గుర్తించారు. అయితే యువతికి గతంలోనే వివాహం(marriage) జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతి, యువకుడి బంధువులకు సమాచారం ఇచ్చారు.