»Good News For Youtube Creators Free Video Editing App For Youtube
YouTube క్రియేటర్లకు శుభవార్త..ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. షార్ట్ వీడియో ఎడిటింగ్ ఇక నుంచి సులువుగా చేసుకునేందుకు యూట్యూబ్ ఓ సరికొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా ఉచితంగా ఫాస్ట్ గా వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. అయితే ఆ యాప్ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Good news for YouTube creators Free video editing app for youtube
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ వీడియో సృష్టికర్తలకు మంచి గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి సులభంగా వీడియోలను రూపొందించేందుకు ‘యూట్యూబ్ క్రియేట్’ అనే పేరుతో కొత్త యాప్ ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా డ్రీమ్ స్క్రీన్ ఫీచర్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. దీని సాయంతో బ్యాక్‌గ్రౌండ్‌లోని చిన్న వీడియోలకు (షార్ట్‌లు)AI ఆధారిత వీడియోలు, చిత్రాలను జోడించి వీడియోను సులువుగా రూపొందించుకోవచ్చని తెలిపింది.
గూగుల్ గురువారం ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ అనే ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా యూట్యూబ్ క్రియేట్ యాప్, డ్రీమ్ స్క్రీన్‌ను యూట్యూబ్ అనౌన్స్ చేసింది. కొత్త ఉత్పాదక AI ఆధారిత యాప్‌లో ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ క్యాప్షనింగ్, వాయిస్ ఓవర్, ట్రాన్సిషన్లు వంటి అనేక ఫీచర్లు ఉంటాయని వెల్లడించింది. ఇది దాదాపు TikTok మాదిరిగా బీట్ మ్యాచింగ్ టెక్నాలజీతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని చెప్పింది. అంతేకాదు రాయల్టీ రహిత సంగీతాన్ని కూడా ఆస్వాదించవచ్చని పేర్కొంది
అయితే ప్రస్తుతం యూట్యూబ్ క్రియేటర్లకు సృజనాత్మకంగా వీడియోలను రూపొందించడం చాలా కష్టమైన పనిగా మారింది. అందుకోసం చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో వీడియోను అప్లోడ్ చేయడం కష్టమైన పని అని అనేక మంది భావిస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి, ఎవరైనా కూడా వీడియోలను సృష్టించడానికి వీలుగా తాము ఈ కొత్త అప్లికేషన్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. చిన్న, పొడవైన వీడియోలను రూపొందించడానికి తాము దీన్ని తీసుకువచ్చామని యూట్యూబ్ కమ్యూనిటీ ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ టోనీ అన్నారు. ఇది ఉచితంగా అందుబాటులో ఉందని చెప్పారు. బీటా వర్షన్ ప్రస్తుతం భారతదేశం, US, జర్మనీ, ఫ్రాన్స్, UK, ఇండోనేషియా, కొరియా, సింగపూర్‌తో సహా ఎంపిక చేసిన మార్కెట్లలో Android వినియోగదారులకు అందుబాటులో ఉందన్నారు. వచ్చే ఏడాది ఐఫోన్లో కూడా ఈ యాప్‌ను ప్రవేశపెడతామని యూట్యూబ్ స్పష్టం చేసింది.