Sai pallavi: సాయిపల్లవి పెళ్లి అయిపోయిందంటూ వార్తలు.. రియాక్షన్ ఇదే..!
ప్రముఖ దక్షిణ భారత నటి సాయి పల్లవి, తమిళ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఉన్న ఒక వైరల్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి, తనపై ఎలాంటి రూమార్స్ వచ్చినా సాయి పల్లవి పెద్దగా పట్టించుకోదు. కానీ, ఈ పెళ్లి అనే రూమర్ క్రియేట్ చేసి ఆమె కుటుంబాన్ని కూడా ఈ విషయంలోకి లాగడంతో, ఆమె స్పందించక తప్పలేదు.
సోషల్ మీడియా వేదికగా సాయిపల్లవి పెళ్లి అయిపోయిందంటూ వస్తోన్న వార్తలకు ఆమె చెక్ పెట్టారు. తాను రూమర్స్ ని పెద్దగా పట్టించుకోనని, కానీ ఈ విషయంలో తన ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేశారని, అందుకే స్పందిస్తున్నానని ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను చేయబోతున్న కొత్త సినిమా పూజా కార్యక్రమంలో దిగిన ఫోటోని క్రాప్ చేసి, పెళ్లి అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని ఆమె అన్నారు.
డబ్బు కోసం ఇంత నీచమైన పనులు చేస్తున్నారని మండిపడ్డారు. తాను తన కొత్త సినిమా అప్ డేట్స్ ని ఫ్యాన్స్ తో పంచుకోవాలని అనుకున్నానని, అలాంటి సమయంలో ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేశారని ఆమె సీరియస్ అయ్యారు. ఇలాంటి పనికి రాని విషయాలపై స్పందించడం కూడా తన బాధగా ఉందని చెప్పారు.
సాయి పల్లవి పెళ్లి పై తరచుగా రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆ మధ్య సాయి పల్లవి సినిమాలు తగ్గించారు. విరాటపర్వం అనంతరం సాయి పల్లవి తెలుగులో సినిమా చేయలేదు. అటు తమిళ్ లో కూడా కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించలేదు. దీంతో సాయి పల్లవి వివాహం చేసుకోబోతున్నారు. అందుకే సినిమాలు వదిలేశారని కథనాలు వెలువడ్డాయి. కాగా, రీసెంట్ గా ఆమె నాగ చైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో సాయి పల్లవి నాగ చైతన్యతో లవ్ స్టోరీలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.