»Good News For Gold Lovers Gold Rate Reduced By Rs770 At June 4th 2023
Gold lovers: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్..రూ.770 తగ్గింది
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరిగిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం (జూన్ 4) ఉదయం పసిడి ఏకంగా 770 రూపాయలు తగ్గింది. దీంతోపాటు వెండి రేటు కూడా పడిపోయింది.
పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగింది. బంగారం ధరలు మరింత తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు 770 రూపాయలు తగ్గి… రూ.60,330కి చేరుకుంది. అలాగే 22 కేరట్ల బంగారం ధర 700 రూపాయలకు పడిపోయి రూ.55, 330 వద్ద నిలించింది. ఇటీవల కాలంలో ఇంత తగ్గుదల ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న వెండి ధర కూడా దిగొచ్చింది. కేజీ ధర రూ.78,600 రూపాయల నుంచి 800 తగ్గి.. రూ.77,800కు చేరుకుంది. మేలిమి బంగారం కూడా దాదాపు 63 వేలకు చేరుకుని తర్వాత పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగార ధర కొన్ని రోజులుగా క్రమంగా కుప్పకూలుతోంది. స్పాట్ గోల్డ్ ధర గత సెషన్ తో పోలిస్తే 10 డాలర్ల తగ్గి 1983 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ధరలు వేసవిలో కాస్త స్థిరంగా కొనసాగే అవకాశముందని నిపుణుల అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కాకపోవడం, పండగలు కూడా లేకపోవడంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.