»Gold Rate Decreased By More Than 3000 Last 10 Days India
Gold rate: 3 వేలకుపైగా తగ్గింది..బంపర్ ఛాన్స్!
మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే ఇదే మంచి సమయం. ఎందుకంటే గత 10 రోజుల్లో పుత్తడి రేటు ఏకంగా 3 రూపాయలకుపైగా తగ్గింది. అయితే ఈరోజు గోల్డ్ రేటు ఎంత ఉంది సహా మరికొన్ని విషయాలను ఇప్పుడు చుద్దాం.
Gold rate decreased by more than 3000 last 10 days india
బంగారం కొనుగోలు చేయాలని లేదా గోల్డ్ పై పెట్టుబడి పెట్టాలని చూసే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు కూడా బంగారం ధర రూ.250కిపైగా తగ్గింది. అంతేకాదు గత 10 రోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూనే వస్తుంది. ఈ క్రమంలో దాదాపు 3 వేల రూపాయలకుపైగా పుత్తడి రేటు దిగజారింది. అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం, బులియన్ మార్కెట్లో ప్రతికూల ప్రభావం సహా పలు కారణాలతో గోల్డ్ రేటు తగ్గుతూ వస్తుంది.
ప్రస్తుతం సెప్టెంబర్ 29న 24 క్యారెట్ గోల్డ్ ధర(Gold rate) గుడ్ రిటర్న్ వెబ్ సైట్ ప్రకారం రూ.58,530 ఉండగా, 22 క్యారెట్ పుత్తడి రేటు రూ.53,650గా ఉంది. ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.58,530, 22 క్యారెట్ రేటు రూ.53,650కు చేరుకుంది. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 22 క్యారెట్ పుత్తడి రేటు రూ.53,800 ఉండగా..24 క్యారెట్ బంగారం రేటు రూ.58,680గా ఉంది. మరోవైపు కోల్కతాలో 22 క్యారెట్ పసిడి ధర రూ.53,650, 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.58,530గా కలదు. మరోవైపు సెప్టెంబర్ 28న 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.58,800 ఉండగా..22 క్యారెట్ బంగారం ధర రూ.53,900గా ఉండేది. ఇక వచ్చే వారం పుత్తడి రేటు ఇంకా తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనేది చూడాలి. అయితే ఆర్థిక నిపుణలు మాత్రం ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరికొంత మంది అయితే ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.