చాలా మందికి స్మార్ట్ వాచ్(Smart Watch)లంటే ఇష్టం. ఇప్పుడు అందరూ స్మార్ట్ వాచ్‌లను వినియోగిస్తున్నారు. అనేక కంపెనీలు కూడా స్మార్ట్ వాచెస్‌ను మంచి డిజైన్లలో తయారుచేస్తూ మార్కెట్లో(Markets)కి వదులుతున్నాయి. వారంలో ఒక్కో కొత్త బ్రాండ్(New Brand) స్మార్ట్ వాచ్ వినియోగదారుల ముందుకు వస్తోంది. తాజాగా గిజ్ మోర్ కంపెనీ ఓ స్టైలిష్ స్మార్ట్ వాచ్‌ను అతి తక్కువ ధరతో మార్కెట్లోకి విడుదల(Release) చేసింది.
ఈ స్మార్ట్ వాచ్(Smart Watch) ధర రూ.5,999 కాాగా 81 శాతం డిస్కౌంట్ తో విక్రయిస్తోంది. అంటే ఈ స్మార్ట్ వాచ్ ను కేవలం రూ.1099కే కొనుగోలు చేయొచ్చు. గిజ్ మోర్ కంపెనీ ఇప్పటి వరకూ చాలా బడ్జెట్ స్మార్ట్ వాచెస్‌ను లాంచ్ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ గిజ్ మోర్ ఫ్లాష్ అనే స్మార్ట్ వాచ్ (Gizmore Flash Smart Watch)ని అతి తక్కువ ధరకే తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ వాచ్ 1.85 ఇంచెస్ డిస్ప్లేతో ఉంది. ఇది 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ని ఇస్తుంది.
వాయిస్ కంట్రోస్ సిస్టమ్ కూడా ఈ స్మార్ట్ వాచ్(Smart Watch)లో ఉంది. అలెక్సా, సిరి ఫీచర్లున్నాయి. ఈ స్మార్ట్ వాచ్ (Gizmore Flash Smart Watch)ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 రోజుల వరకూ వినియోగించుకోవచ్చు. అదేవిధంగా బ్లూటూత్ కాలింగ్ కు మూడు రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 స్టాండర్స్ ఉన్నాయి.
ఈ స్మార్ట్ వాచ్ (Smart Watch)లో సెన్సార్స్ కూడా చాలా బావున్నాయి. బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేట్ మానిటరింగ్, హైడ్రేషన్ అలర్ట్, కేలరీ బర్న్ ట్రాకర్, పీరియడ్ ట్రాకర్, బ్రీతింగ్ గైడ్, స్లీప్ మానిటర్ వంటి ఆప్షన్లున్నాయి. మల్టిఫుల్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి. 3 ఇన్ బిల్ట్ గేమ్స్ కూడా స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి. రూ.1099కే ఇన్ని ఫీచర్లతో ఈ గిజ్ మోర్ ఫ్లాష్ స్మార్ట్ వాచ్(Gizmore Flash Smart Watch) ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉంది.