న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత రెండు రోజులుగా వర్షం కారణంగా పిచ్ కవర్ల కింద ఉన్నప్పుడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎలా ఎంచుకుంటాడని రోహిత్‌పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఓవర్‌కాస్ట్ కాండీషన్స్లో తొలుత బౌలింగ్ చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు.