టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి వన్‌డౌన్ పొజిషన్ కలిసిరావడం లేదు. NZతో జరుగుతున్న టెస్టులో గిల్ గైర్హాజరీతో దాదాపు 8 ఏళ్ల తర్వాత కోహ్లీ మూడో స్థానంలో బరిలోకి దిగి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇప్పటివరకు కోహ్లీ 4 టెస్టుల్లో మాత్రమే ఈ ప్లేస్‌లో బ్యాటింగ్ చేశాడు. కాగా కేవలం 97 పరుగులు మాత్రమే చేసి ఒక్క హాఫ్ సెంచరీ చేయకపోవడం గమనార్హం. కోహ్లీ చివరిసారిగా 2016లో WIపై 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.