ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అతడిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ‘హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానానికి నువ్వు సంపూర్ణ అర్హుడివి. నేను కలిసి ఆడిన క్రికెటర్లలో నువ్వు అత్యంత ప్రతిభావంతుడివి. నంబర్ వన్ ఆటగాడివి’ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.