»World Cup 2023 Sri Lanka Australia Match At Atal Bihari Vajpayee Stadium In Lucknow What Is The Target
AUS vs SL: ముగిసిన శ్రీలంక బ్యాటింగ్..ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
వరల్డ్‌కప్ 2023లో భాగంగా నేడు లక్నోలో ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయి. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడినా వర్షం తగ్గిన తరువాత ఆటను కొనసాగించారు. ఆసీస్ బౌలింగ్ దాడికి వికెట్లు నష్టపోయిన శ్రీలంక ఫైనల్‌గా 209 రన్స్ కొట్టింది.
World Cup 2023, Sri Lanka-Australia match at Atal Bihari Vajpayee Stadium in Lucknow.. What is the target?
AUS vs SL: వరల్డ్‌కప్2023(World Cup 2023)కి భారత్ అతిథ్యం ఇస్తున్నఛాంపియన్ షిప్ లో నేడు ఆస్ట్రేలియా(Australia), శ్రీలంక(Sri Lanka) జట్లు పోటీపడుతున్నాయి. ఈ పోరు లక్నో(Lucknow)లోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం(Atal Bihari Vajpayee Stadium) వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బౌలింగ్‌తో కట్టడి చేసింది. ఇంతలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. తరువాత ఆట కొనసాగింది. చివరిగా చరిత్ అసలంక(25) బ్యాటింగ్ చేయగా శ్రీలంక స్కోర్ 209 స్కోరుకు అలౌట్ అయ్యారు.
వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి శ్రీలంక 32.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు పత్తుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా తొలి వికెట్ కు 125 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ, శ్రీలంక వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుశాల్ పెరీరా 82 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 78 పరుగులు చేయగా, నిస్సాంక 67 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. వీరిద్దరినీ ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కుశాల్ మెండిస్ (9), సదీర సమరవిక్రమ (8)లను జంపా అవుట్ చేశాడు. దాంతో లంక చూస్తుండగానే 4 వికెట్లు కోల్పోయింది. వర్షం శాంతించడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. ఇద్దరు ఓపనర్లు అవుట్ అయిన తరువాత, గొప్ప ఆటను ఎవరూ కొనసాగించలేదు. ఫలితంగా ఆస్ట్రేలియా దాడికి శ్రీలంక కుప్పకూలిపోయింది. మొత్తానికి 209 పరుగులు చేసి ఆసీస్‌కు 210 టార్గెట్‌ను ఫిక్స్ చేసింది.