టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో… ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తవ్ర నిరాశకు గురయ్యారు. తన బాధ మొత్తాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే విరాట్ ఇన్‌స్టాలో ఎంతో బాధతో ఓ పోస్ట్ చేశాడు. తమ కల నెరవేరడానికి కొద్ది దూరంలో ఆగిపోయినట్లు అతడు చెప్పాడు. “మా కల నెరవేరకుండానే ఆస్ట్రేలియాను వీడాల్సి వస్తోంది. చాలా బాధగా ఉంది. అయితే టీమ్‌లో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మా వెంట మోసుకొస్తున్నాం. ఇక్కడి నుంచి ఇంకా మెరుగవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ టోర్నీ మొత్తం పెద్ద సంఖ్యలో వచ్చి మాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. ఈ జెర్సీ వేసుకోవడానికి, దేశం తరఫున ఆడటానికి ఎప్పుడూ గర్వంగానే ఫీలవుతాను” అని విరాట్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో స్పష్టం చేశాడు.
విరాట్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. టీమిండియా దారుణంగా ఓడిపోయిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో తన వంతు పాత్ర పోషించాడు. అయినా ఫలితం లేకుండాపోయింది. చాలా తక్కువ స్కోర్ చేయడంతో.. ఇంగ్లాండ్ సులభంగా విజయం సాధించడం గమనార్హం.