కింగ్ విరాట్ కోహ్లీ 2023 ఏడాదిలో అద్భుత రికార్డులు సాధించాడు. గతంలో తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాదిలో మాత్రం పరుగుల వర్షాన్ని కురిపించాడు. అన్ని మ్యాచుల్లోనూ, అన్ని ఫార్మాట్లలోనూ దూసుకుపోయాడు. ఈ తరుణంలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 2023వ సంవత్సరం విరాట్ కోహ్లీకి చాలా గుర్తుండిపోయే సంవత్సరంగా మారింది.
ఈ ఏడాదిలో విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ లో 2000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. అలాగే 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేసి ప్రత్యేక రికార్డులను నెలకొల్పాడు. 2022లో విరాట్ కోహ్లీ టీ20 ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించడంతో పూర్తి ఫామ్ లోకి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. రికార్డుల మోత మోగించాడు.
2023లో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు ఇవే:
అన్ని ఫార్మాట్లలో కలిపి 2048 పరుగులు చేశాడు.
10 సెంచరీలు సాధించాడు.
8 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేశాడు.
ఐపీఎల్లో 639 పరుగులు చేయగా, ప్రపంచకప్లో అత్యధికంగా 765 పరుగులు సాధించాడు.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.