నిన్న జరిగిన ఇండియా, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 349 భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో బ్యాటర్ శుభ్ మన్ గిల్ అద్భుతంగా రాణించాడు. 23 ఏళ్ల వయసులో గిల్ డబుల్ సెంచరీని ఫాస్టెస్ట్ గా చేసి రికార్డు నెలకొల్పాడు. 208 పరుగులు చేసిన శుభ్ మన్ గిల్ ఎలైట్ గ్రూపులో 9వ స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని ఐసీసీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇందులో డబులు సెంచరీ చేసిన పది మంది బ్యాటర్ల జాబితాను ఉంచింది. అందులో 264 పరుగులు చేసి మొదటి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు.
డబుల్ బాదిన క్రికెట్ వీరులు
ఐసీసీ విడుదల చేసిన ఆ జాబితాలో పది మందిలో మొదటి ఐదుగురు ఇండియా బ్యాటర్లే ఉన్నారు. రోహిత్ శర్మ ఒక్కడే మూడు సార్లు డబుల్ సెంచరీ చేశాడు. ఇండియా నుంచి ఎలైట్ గ్రూపులో రోహిత్ శర్మ 264, 209, 208 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వీరేందర్ సెహ్వాగ్ 219 పరుగులు, ఇషాన్ కిషన్ 210 పరుగులు, శుభమన్ గిల్ 208 పరుగులు, సచిన్ టెండుల్కర్ 200లతో ఎలైట్ జాబితాలో కొనసాగుతున్నారు. అయితే ఇతర దేశాల క్రికెటర్లలో ముగ్గురే ఐసీసీ ఎలైట్ గ్రూప్ లో చోటును దక్కించుకున్నారు. అందులో మార్టిన్ గుప్తిల్ 237 పరుగులు, క్రిస్ గేల్ 215 పరుగులు, ఫఖార్ జమాన్ 210 పరుగులతో ఎలైట్ గ్రూపులో స్థానాన్ని పొందారు.