భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మోకాలికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సర్జరీతో అతను కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. దీంతో షమీ ఐపీఎల్‌కి పూర్తిగా దూరంగా కానున్నాడు. మళ్లీ మైదానంలోకి ఎప్పుడు వచ్చి ఆడుతాడో వేచి చూడాల్సిందే.
Shami: భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మోకాలికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సర్జరీతో అతను కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. దీంతో షమీ ఐపీఎల్‌కి పూర్తిగా దూరంగా కానున్నాడు. అయితే జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండటం కూడా అనుమానమే. ప్రపంచకప్ ఆడుతున్న సమయంలోనే షమి చీలమండకు గాయమైంది. గాయం వేధిస్తున్న కూడా అతను కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. అప్పుడే సమస్య తీవ్రత ఎక్కువైంది. ఆస్ట్రేలియాతో ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన వెంటనే చికిత్స తీసుకోవడానికి షమీ లండన్ వెళ్లాడు. కానీ తగ్గలేదు. దీంతో సమస్య మళ్లీ మెదటికి రావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో షమీ ఆడటం కష్టమే. అయితే షమీ మళ్లీ మైదానంలోకి వచ్చి ఆడటానికి కొన్ని నెలల సమయం పడుతుందనే చెప్పవచ్చు. అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో, నవంబర్‌లో న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లకు అయిన అందుబాటులో ఉంటాడో లేదో అనుమానమే. ఒకవేళ ఈ సిరీస్‌లలో ఆడకపోతే నవంబర్‌లో ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సమయానికైనా షమీ ఆడతాడో లేదో చూడాలి. ఆస్ట్రేలియా వంటి ప్రధాన సిరీస్‌లలో షమి లాంటి పేసర్ సేవలు చాలా ముఖ్యం. మరి షమీ మైదానంలో ఎప్పుడు ఆడతాడో తెలియాలంటే కొన్ని రోజులు వేచియుండాల్సిందే.