టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh pant) తన హెల్త్‌పై మరో అప్డేట్ ఇచ్చాడు. కర్ర సాయంతో రిషబ్ పంత్ నడుస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తాను కర్రల సాయంతో నడుస్తున్నానని, త్వరగానే కోలుకుంటున్నానని తెలిపాడు.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh pant) తన హెల్త్‌పై మరో అప్డేట్ ఇచ్చాడు. కర్ర సాయంతో రిషబ్ పంత్ నడుస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తాను కర్రల సాయంతో నడుస్తున్నానని, త్వరగానే కోలుకుంటున్నానని తెలిపాడు. ‘ఒక అడుగు ముందకు. ఒక అడుగు బలంగా. ఒక అడుగు మరింత మెరుగ్గా’ అంటూ తాను పోస్టు చేసిన ఫోటోలకు క్యాప్షన్‌ను జోడించాడు. రిషబ్ పంత్(Rishabh pant)కు కారు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. కారు ప్రమాదం తర్వాత పంత్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. అయితే ప్రమాదం తర్వాత తాజాగా ఫోటోలను షేర్ చేశాడు.
2022 డిసెంబర్ 30వ తేదిన రిషబ్ పంత్(Rishabh pant) కారు డ్రైవ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కారు రూర్కీ సమీపంలో యాక్సిడెంట్‌కు గురవ్వడంతో పంత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తాను టీమిండియాకు కూడా దూరమయ్యాడు. వైద్య చికిత్స చేయించుకుంటున్న పంత్(Rishabh pant) తన ఆరోగ్య పరిస్థితిని ఫ్యాన్స్ కు తెలియజేస్తూ వచ్చాడు. తాజాగా తాను ఊతకర్ర సాయంతో నడుస్తున్న ఫొటోలను షేర్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు కాస్తా ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పంత్ త్వరగా కోలుకొని మైదానంలో అడుగుపెట్టాలని చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రిషబ్ పంత్(Rishabh pant) వికెట్ కీపర్‌గానే కాకుండా విధ్వంసక బ్యాటర్‌గా రాణిండంతో జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. తక్కువ కాలంలోనే పంత్ మెయిన్ ప్లేయర్ల జాబితాలోకి చేరిపోయాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లో రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి అందరి మన్ననలు పొందాడు. 2022లో రిషబ్ పంత్ 7 టెస్టుల్లో 680 రన్స్ చేశాడు. అలాంటి పంత్ యాక్సిడెంట్ కారణంగా ఈ ఏడాది చాలా వరకు క్రికెట్‌కు దూరం అయ్యే అవకాశం ఉంది.
పంత్ కోలుకునేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో పంత్ ను ఆస్ట్రేలియా సిరీస్ కు కూడా ఎంపిక చేయలేదు. పంత్(Rishabh pant) స్థానంలో తెలుగు ఆటగాడు అయిన శ్రీకర్ భరత్ ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. పంత్ గాయం కారణంగా ఈ ఏడాదిలో జరిగే పలు సిరీస్ లకు దూరం కానున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ పంత్ ఆడలేడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతని స్థానంలో మరొకరిని కెప్టెన్‌గా నియమించే అవకాశం కూడా ఉంది.