భారత టెన్నిస్ క్రీడాకారిణి పీవీ సింధు మోకాలికి గాయం అయ్యింది. దీంతో ఆమె కొన్ని వారాల పాటు ఆటకు దూరం కానుంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆమె ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననుంది.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (Pv sindhu) మోకాలికి గాయం అయ్యింది. రెండు సార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన పీవీ సింధు ఎడమ కాలుకు గాయం అవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆమె మోకాలుకు స్వల్పంగానే క్రాక్ వచ్చినట్లుగా వైద్యులు తెలిపారు. స్కానింగ్ తీసిన తర్వాత డాక్టర్లు ఆమెను విశ్రాంతి తీసుకోమని సూచించారు. గతవారం టెన్నిస్‌లో జరిగిన ఫ్రెంచ్ సూపర్ ఓపెన్ రెండో రౌండ్లో పీవీ సింధు గాయం కారణంగా తప్పుకుంది.
Determined to come back firing on all cylinders ❤️
Not the ideal update, but going to make this count 🤫
థాయిలాండ్‌కు చెందిన సుపనిదా కటేతాంగ్‌తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆమెకు గాయం (Knee injury) అయ్యింది. మళ్లీ ట్రైనింగ్ ప్రారంభించడానికి ముందు కొన్ని వారాల పాటు ఆమె విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. బ్రేక్ తీసుకోవడం వల్ల రాబోయే ఒలింపిక్స్ క్రీడల (Olympics Games)పై ఆమె ఫోకస్ పెట్టనుంది. త్వరలోనే కోలుకుని ఆమె మళ్లీ టెన్నిస్ కోర్టు (Tennis Court)లో అడుగుపెట్టనున్నట్లు తెలిపింది.
ఈ సీజన్లో పీవీ సింధు (PV Sindhu) కాస్త తడబడుతోందని, ఆమె తన ఫామ్‌ను కోల్పోయిందని తెలుస్తోంది. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మధ్యనే ఆమె టాప్ టెన్‌లో స్థానాన్ని సంపాదించుకుంది. ఆర్కిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్ టోర్నీల్లో సెమీస్‌కు వెళ్లడం వల్ల ఆమె ర్యాంక్ కొంత వరకూ మెరుగుపడినట్లయ్యింది. ఆగస్టులో సింధు ర్యాంక్ 17కు పడిపోయింది. ఇకపోతే నవంబర్ 7 నుంచి 12వ తేది వరకూ కొరియా మాస్టర్స్, నవంబర్ 14 నుంచి 19 వరకూ జపాన్ మాస్టర్స్, నవంబర్ 21 నుంచి 26 వరకూ చైనా మాస్టర్స్, నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకూ సయ్యిద్ మోదీ ఇండియా ఇంటర్నేషన్ టోర్నీలు నిర్వహించనున్నారు. మోకాలికి గాయం కారణంగా ఈ టోర్నీలకు పీవీ సింధు దూరం కానుంది.