2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. గత నాలుగు నెలలుగా పాకిస్తాన్ ఆటగాళ్లకు జీతాలు అందలేదు. జీతాలు చెల్లించకపోవడంతో జట్టు ఆటగాళ్లు ప్రపంచకప్ ప్రమోషన్, స్పాన్సర్షిప్ లోగోలను బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారు.
Pakistan Cricket Team: పొరుగు దేశం పాక్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. అక్కడ రూపాయికి విలువ లేకుండా పోయింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్రవ్యోల్బణంగా గణనీయంగా పెరిగిపోయింది. దాదాపు దేశ జనాభాలో 42శాతం మంది ప్రజలు కడు పేదరికంలో బతుకుతున్నారని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం పాకిస్తాన్ టీం క్రికెటర్ల పరిస్థితి కూడా అలాగే తయారైంది. 2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. గత నాలుగు నెలలుగా పాకిస్తాన్ ఆటగాళ్లకు జీతాలు అందలేదు. జీతాలు చెల్లించకపోవడంతో జట్టు ఆటగాళ్లు ప్రపంచకప్ ప్రమోషన్, స్పాన్సర్షిప్ లోగోలను బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారు. ఇది ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్‌కు పెద్ద సమస్యలను సృష్టించవచ్చు.
‘క్రికెట్ పాకిస్థాన్’ నివేదిక ప్రకారం, గత నాలుగు నెలలుగా పాక్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు లేదా జీతాలు అందలేదు. దీని కారణంగా ఆటగాళ్లు బాగా కోపంగా ఉన్నారు. ఆటగాళ్ల జీతాల్లో చారిత్రాత్మకమైన పెంపుదల ఉంటుందని ఇంతకుముందు నివేదికలు పేర్కొన్నాయి, అయితే కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ ఇంకా సంతకం చేయలేదు. ఈ విషయాలను పేరు బయటికి చెప్పలేనటువంటి ఓ క్రికెటర్ తెలిపినట్లు సమాచారం. ఐసిసి, స్పాన్సర్ల నుండి వచ్చే ఆదాయంలో వాటాను ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారని నివేదిక పేర్కొంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ, స్పాన్సర్ల నుండి దాదాపు రూ.9.8 బిలియన్లను పొందుతుంది.
బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు 2023 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో అక్టోబర్ 6న హైదరాబాద్‌లో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత అక్టోబర్ 10న హైదరాబాద్‌లోనే శ్రీలంకతో రెండో మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జట్టు అహ్మదాబాద్ చేరుకుంటుంది.అక్కడ వారు అక్టోబర్ 14న భారత్‌తో గొప్ప మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.