»Pak Vs Sl Asia Cup 2023 Super 4 Match Played 45 Overs Per Side Match
PAK vs SL: పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్‌కి వర్షం అంతరాయం.. ఎన్ని ఓవర్లు కట్ చేశారంటే ?
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో నేడు పాకిస్థాన్-శ్రీలంక మధ్య సూపర్-4లో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో ఇప్పుడు మ్యాచ్ 45 ఓవర్లకు కుదించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:15 గంటలకు టాస్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన రెండు జట్లలో ఒకరు ఫైనల్‌కు చేరుకుంటారు.
PAK vs SL: కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో నేడు పాకిస్థాన్-శ్రీలంక మధ్య సూపర్-4లో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో ఇప్పుడు మ్యాచ్ 45 ఓవర్లకు కుదించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:15 గంటలకు టాస్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన రెండు జట్లలో ఒకరు ఫైనల్‌కు చేరుకుంటారు. ఈ మ్యాచ్‌లో తొలి పవర్ ప్లే 9 ఓవర్లు ఉంటుంది. రెండవది 10 నుండి 36 ఓవర్ల వరకు ఉంటుంది. చివరి పవర్ ప్లే 37 నుండి 45 ఓవర్ల వరకు ఉంటుంది.
2023 ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ ఫైనల్ దృష్ట్యా చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. అయితే ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో త్వరలో ఆటను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:15 గంటలకు వేయబడుతుంది. ఒక బౌలర్ ఒక మ్యాచ్‌లో గరిష్టంగా 9 ఓవర్లు వేయగలడు.
ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ ఇప్పటికే తన జట్టులోని 11 మందిని ప్రకటించింది. ఇందులో 5 ప్రధాన మార్పులు కనిపించాయి. ఇందులో నసీమ్ షా, హరీస్ రవూఫ్ స్థానంలో మహ్మద్ వసీం జూనియర్, జమాన్ ఖాన్లు జట్టులోకి వచ్చారు. ఇది కాకుండా, ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ అయిన ఫహీమ్ అష్రాఫ్ స్థానంలో మహ్మద్ నవాజ్‌ను కూడా చేర్చాలని పాకిస్తాన్ నిర్ణయించింది. ఆసియాకప్‌లో ఇప్పటివరకు జరిగిన ఫైనల్లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య పోరు ఎప్పుడూ చూడలేదు. ఈ మ్యాచ్ రద్దు చేయబడితే పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోతుంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల భారీ ఓటమి కారణంగా రన్ రేట్ పడిపోయింది. దీంతో పాక్ ఫైనల్ కు చేరే అవకాశాన్ని కోల్పోతుంది.