»Indian Cricket Team Bowling Coach Paras Mhambrey On Hardik Pandya Asia Cup Sports News
Hardik Pandya: హార్దిక్ పాండ్యాను పొగడ్తలతో ముంచేసిన టీం ఇండియా కోచ్.. ఏమన్నాడంటే?
శ్రీలంకపై హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన తీరు అభినందనీయమని భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నారు. పరాస్ మాంబ్రే హార్దిక్ పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తాడు.
Hardik Pandya: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆసియాకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. సూపర్-4 రౌండ్లో భారత జట్టు 228 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.దీని తర్వాత దషున్ షనక నేతృత్వంలోని శ్రీలంక జట్టును టీమిండియా ఓడించింది. తద్వారా భారత జట్టు 4 పాయింట్లతో ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరగనుంది. హార్దిక్ పాండ్యాపై భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పెద్ద ప్రకటన చేశాడు.
శ్రీలంకపై హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన తీరు అభినందనీయమని భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నారు. పరాస్ మాంబ్రే హార్దిక్ పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తాడు. శ్రీలంకపై హార్దిక్ పాండ్యా 5 ఓవర్లలో 14 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. గతంలో పాకిస్థాన్‌పై హార్దిక్ పాండ్యా తన అద్భుతమైన ఇన్‌స్వింగ్‌తో బాబర్ అజమ్‌ను ఫెవీలియన్ కు పంపాడు.
భారత్-శ్రీలంక మ్యాచ్ లో దశన్ షనక జట్టుకు 214 పరుగుల విజయ లక్ష్యం ఉంది. కానీ ఆతిథ్య శ్రీలంక జట్టు 41.3 ఓవర్లలో కేవలం 172 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది.