ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు. ‘మోదీ నోటీసు వచ్చింది. ఇది రాజకీయ కక్షతోనే పంపించారు. మా లీగల్ టీమ్‌ని సంప్రదించి ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని కవిత అన్నారు. ఎలక్షన్లు వస్తున్నాయ్ కాబట్టి మళ్లీ ఈ డ్రామా చేస్తున్నారు. ఏడాది నుంచి టీవీ సీరియల్లాగా దీన్ని సాగదీస్తున్నారు’ అని నిజామాబాద్(Nizamabad)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. దీని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదని కవిత అన్నారు. లిక్కర్ స్కాం కేసులో రేపు విచారణకు రావాలని ఈ నోటీసుల్లో పేర్కొంది.
ఈ కేసులో అరుణ్ పిళ్లై (Arun Pillai) ఇటీవల అప్రూవర్ గా మారడంతో నోటీసులు జారీ చేసింది. దీంతో కవిత విచారణ కీలకంగా మారనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన బిజినెస్మెన్ అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమచారం.ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్(Approver)గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. కవితను మరోసారి విచారణకు పిలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.