»Hyderabad Woman In Us Syeda Zaidi Does Not Want To Come To India Ready To Live On The Streets
Syeda Zaidi: అడుక్కుని అయినా తింటాను.. కానీ అమెరికాను వదిలి రానంటున్న హైదరాబాదీ
ప్రజల విజ్ఞప్తిని సీరియస్‌గా తీసుకున్న అమెరికాలోని భారత రాయబార కార్యాలయం బాధిత మహిళకు సహాయం చేయాలని తలచింది. భారతీయ మహిళ తన ఇంటికి (హైదరాబాద్) రావడానికి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి.
Syeda Zaidi: అమెరికాలోని చికాగో వీధుల్లో ఓ భారతీయ మహిళ సంచరించడం చర్చనీయాంశంగా మారింది. తనని భారత్‌కు రప్పించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ప్రజల విజ్ఞప్తిని సీరియస్‌గా తీసుకున్న అమెరికాలోని భారత రాయబార కార్యాలయం బాధిత మహిళకు సహాయం చేయాలని తలచింది. భారతీయ మహిళ తన ఇంటికి (హైదరాబాద్) రావడానికి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి.
చికాగో వీధుల్లో ఆకలి, దాహంతో బాధపడుతున్న ఈ మహిళ భారతదేశంలోని హైదరాబాద్‌కు చెందిన సైదా జైదీగా గుర్తించబడింది. ఈ మహిళ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, ప్రజల కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. మహిళ పరిస్థితిని చూసిన ప్రజలు ఆమెను సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. భారతదేశంలోని బాధితురాలి తల్లి , కుటుంబం విజ్ఞప్తి మేరకు చికాగోలోని భారత రాయబార కార్యాలయం మహిళకు సహాయం చేయడానికి చొరవ తీసుకుంది.
ఆ తర్వాత చికాగోలోని భారత కాన్సులేట్ మహిళను సంప్రదించి, భారతదేశానికి తిరిగి రావడానికి ఆమెకు వైద్య, ప్రయాణ సహాయాన్ని అందించింది. కానీ మహిళ దీనిని నిరాకరించింది . ఇప్పటికీ తన నిర్ణయంపై మొండిగా ఉంది. చికాగోలోని భారత రాయబార కార్యాలయం తన తాజా ప్రకటనలో ‘భారత్‌కు తిరిగి రావడానికి సైదా జైదీకి మేం పదేపదే పూర్తి సహాయాన్ని అందించాం, అయితే ఆమె వైపు నుండి ఇంకా సానుకూల స్పందన లేదని పేర్కొంది. డెట్రాయిట్‌లోని ట్రిన్ యూనివర్శిటీ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందేందుకు సైదా జైదీ అమెరికా వెళ్లింది.