Team India Won Asia Cup: ఆసియా కప్ టైటిల్‌ను టీమిండియా (Team India ) గెలుచుకుంది. ప్రత్యర్థి శ్రీలంకను చిత్తు చేసి.. టైటిల్ ముద్దాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంకను హైదరాబాదీ బౌలర్ సిరాజ్ చుక్కలు చూపించాడు. ఆరు వికెట్లు తీసి లంక వెన్ను విరిచాడు. బుమ్రా సహకారం.. చివరలో పాండ్యా మూడు వికెట్లు తీయడంతో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కేవలం 6.1 ఓవర్లలో టార్గెట్ చేధించింది.
సిరాజ్ ఆరు వికెట్లు తీయగా.. పాండ్యా 3 వికెట్లు తీశాడు. బుమ్రా వికెట్ తీయడంతో లంక 50 పరుగులకే చాప చుట్టేసింది. 51 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. వికెట్ నష్టపోకుండా విక్టరీ కొట్టింది. ఇషాన్ కిషన్ 23 పరుగులు, శుభ్‌మన్ గిల్ 27 పరుగులు చేశాడు. ఒక పరుగు ఎక్స్ ట్రా లభించింది. అలా.. 6.1 ఓవర్లలోనే టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు విక్టరీ కొట్టి మంచి ఊపు మీదుంది. వరల్డ్ కప్‌కు కూడా ఈ విజయం రోహిత్ సేనకు బూస్టింగ్ ఇవ్వనుంది.
టీమిండియాకు ఇది 8వ ఆసియా కప్ టైటిల్. 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018లో ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది.