ఐర్లాండ్ తో జరిగిన టీమిండియా(india vs ireland) సిరీస్ ని భారత్ కైవసం చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్ లు భారత్ విజయం సాధించింది. మూడో మ్యాచ్ తో క్లీన్ స్వీప్ చేయాలని అనుకున్నారు. కానీ, మూడో మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ రద్దు అయ్యింది.
ఆసియా కప్ 2023 ఆడేందుకు భారత జట్టు తుది ఎంపిక జరిగింది. ఇందులో ఆల్ రౌండన్ హర్ధిక్ పాండ్యకు బ్యాక్ అప్‌గా శార్దుల్ ఠాకూర్ బదులు శివమ్ దూబెను తీసుకుంటే బాగుండేదని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించగా.. జట్టులో మార్పులు అవసరం లేదని సునీల్ జోషి స్పందించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించడంలో విఫలమైన కారణంగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW).. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) సభ్యత్వాన్ని నిరవధికంగా రద్దు చేసింది.
ప్రపంచ టెన్నిస్ దిగ్గజం అయిన సెరెనా విలియమ్స్ మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిల్ శర్మ నేతృత్వంలో 17 మందిని ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, తిలక వర్మ, సంజు శాంసన్‌కు జట్టులో చోటు కల్పించింది.
లీగ్స్ కప్ 2023 ఫైనల్ పోటీలో లియోనెల్ మెస్సీ(Lionel Messi) ఇంటర్ మియామి(Inter Miami) తరఫున అదరగొట్టాడు. పెనాల్టీలో భాగంగా 10-9తో నాష్‌విల్లేను ఓడించి మెస్సీ ఆల్ టైమ్ రికార్డు సాధించాడు. దీంతో తన కేరీర్లో సరికొత్త ఘనతను చేరుకున్నాడు.
ఇంగ్లాండ్ గడ్డపై భారత్ సత్తా చాటింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ప్రత్యర్థి జట్టును ఇరకాటంలో నెట్టి 139 పరుగులకే ఆలౌట్ చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది.
సచిన్ రికార్డులను ఎవరూ టచ్ చేయలేరనుకుంటే.. అద్భుతమైన ఆటతో విరాట్ కోహ్లీ ఆ దిశగా కొనసాగుతున్నాడు. కొన్ని రికార్డుల్లో సచిన్‌ను విరాట్ అధిగమించే అవకాశాలు ఉన్నాయి.