»Indian Cricket Team Won The T20 Series Against Ireland
Teamindia: ఐర్లాండ్‌పై గెలుపు..అయితే వర్షమే
ఇంగ్లాండ్ గడ్డపై భారత్ సత్తా చాటింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ప్రత్యర్థి జట్టును ఇరకాటంలో నెట్టి 139 పరుగులకే ఆలౌట్ చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది.
Cricket: డబ్లిన్(Dublin)లోని ద విలేజ్ వేదికగా జరిగిన ఐర్లాండ్(Ireland)తో టీ20 సిరీస్‌లో చాలా ఉత్కంఠ తరువాత ఇండియా టీమ్(Indian cricket team) విజేతగా నిలిచింది. ఇండియ సెకండ్ టీమ్‌తో బరిలోదిగి తొలి టీ20ని కైవస్ చేసుకుంది. చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్‌తో సమష్టిగా సత్తా చాటారు. కెప్టెన్ బుమ్రా చాలా నెలల తరువాత ఫామ్‌లోకి వచ్చారు. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 47/2తో ఉన్న దశలో వర్షంతో మ్యాచ్ ఆగిపోయింది. వాన ఎంతకీ తగ్గపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్ధతి(DLS)లో భారత్‌ను విజేతగా ప్రకటించారు.
మొదట టాస్ గెలిచిన భారత్(Team India) అన్ని పరిస్థితులను అంచనా వేసుకొని బౌలింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం సరైందే అనిపించింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కేవలం 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఐర్లాండ్ కనీసం వందైనా చేస్తుందా అని సందేహాలు మొదలయ్యాయి. కేవలం 11 ఓవర్లకే ఐర్లాండ్ 6 వికెట్లను స్వాధీనం చేసుకున్న భారత్‌కు ప్రత్యర్థులను ఆల్ చేయడానికి ఎంతో సమయం పట్టదు అనుకున్నారు. ఈ క్రమంలో ఆల్‌రౌండర్లయిన మెకార్తీ, క్యాంఫర్ గొప్పగా పోరాడి జట్టుకు మంచి స్కోర్‌ను అందించారు. ఫలితంగా 139 పరుగులు చేశారు.
140 పరుగల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ చేయడం ప్రారంభించింది. మధ్యలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. తగ్గే అవకాశాలు కూడా కనిపించలేదు. అప్పటికే భారత్ స్కోర్ 6.5 ఓవర్లలో 2 వికెట్లకు 47 పరుగులు. డీఎల్ఎస్ ప్రకారం అప్పటికి 45 పరుగులు చేస్తే సరిపోతుంది. వర్షం పడే సమయానికి టీమిండియా 2 పరుగులు ముందే ఉంది. ఇక ఎంతకీ వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో డీఎల్ఎస్ ప్రకారం భారత్ ను విజేతగా ప్రకటించారు. మూడు టీ20ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆగస్టు 20న ఇదే మైదానంలో జరగనుంది.