ఐసీసీ వన్డే బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. కొత్త ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మొదటి స్థానంలో ఉన్నాడు. టీమిండియా యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ 4వ స్థానంలో నిలిచాడు. టాప్-5లో గిల్ తప్పా టీమిండియా క్రికెటర్లు ఎవ్వరూ లేదు. గిల్ తర్వాత టాప్10లో విరాట్ కోహ్లీ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసియా కప్ టోర్నీకి మరో వారం రోజులు మాత్రమే ఉంది. తదుపరి ర్యాంకింగ్స్ లో మార్పులు చాలా వచ్చే అవకాశం ఉంది.
టీ20ల్లో సూర్య కుమార్ యాదవ్ టాప్ ప్లేస్లో ఉండగా 2వ స్థానంలో మహ్మద్ రిజ్వాన్, 3వ స్థానంలో బాబర్ అజామ్, 4లో ఐడెన్ మర్క్రమ్, ఐదవ స్థానంలో రిలీ రౌసో ఉన్నారు. సూర్యకుమార్ తప్పా టాప్-10 మరే టీమిండియా క్రికెటర్లు లేకపోవడం గమనార్హం. టెస్ట్ బ్యాటర్ల విషయానికొస్తే టాప్-10లో రోహిత్ శర్మ మాత్రమే కొనసాగుతున్నాయి. ఈ వరుసలో కేన్ విలియమ్సన్ మొదటి స్థానంలో ఉన్నాడు.
టెస్ట్ బౌలర్ల విషయానికొస్తే రవిచంద్రన్ టాప్లో ఉన్నాడు. టెస్ట్ ఆల్రౌండర్ల లిస్టులో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు. వన్డే బౌలర్ల జాబితాలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ నాలుగో ప్లేస్లో ఉండగా కుల్ దీప్ యాదవ్ పదో స్థానంలో ఉన్నాడు.
ICC వన్డే బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్స్:
బాబర్ అజామ్ (పాకిస్తాన్) – 880 పాయింట్లు
రస్సీ వాండర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా) – 777
ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్) – 752
శుభ్మన్ గిల్ (భారతదేశం) – 743
ఫఖర్ జమాన్ (పాకిస్తాన్)- 740
హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) – 726
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 726
క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా)- 718
విరాట్ కోహ్లీ (భారతదేశం) – 705
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 702