మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆసియా కప్, ప్రపంచ కప్ కోసం టీమిండియా తుది జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు (Left handers)ఉండాలన్న వాదనతో ఆయన విభేదించారు. ఇంతకంటే చెత్త సలహా మరొకటి లేదన్నారు. బ్యాటర్‌ది ఎడమ చేతి వాటమా? కుడి చేతి వాటమా? అన్నది సంబంధం లేదని, అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నవాళ్లను ఎంపిక చేస్తే సరిపోతుందని ఆయన అన్నారు. టీమ్‌లో కనీసం ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే బాగుంటుందన్నారు. గత ఎనిమిది నెలలుగా ఇషాన్ కిషన్ (Ishan Kishan) తీరు గమనిస్తే, బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ చేస్తున్నాడని, అతడితో పాటు మరో ఇద్దరు.. జడేజాను కూడా కలిపితే టాప్ 7లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారన్నారు.
ఈ వ్యాఖ్యలపై గంభీర్ ఘాటుగా స్పందించారు. జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండాలనేది చెత్త ఆలోచన అని, ఎందరు లెఫ్ట్ హ్యాండర్లు అనేది ముఖ్యం కాదని, ఫామ్ (Farm) ముఖ్యమని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఒత్తిడిని తట్టుకొని ఆడేవారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎవరైనా బ్యాట్స్ మెన్ రాణిస్తే అతనిని కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలన్నారు. లెఫ్ట్ హ్యాండర్ అనేది పనికి రాని చర్చ అన్నారు. తిలక్ వర్మ(Tilak Verma), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. ఇలా ఎవరు ఫామ్‌లో ఉంటే వారిని ఎంచుకోవాలన్నారు. కానీ లెఫ్ట్ హ్యాండరే అంటే సరికాదన్నారు.