»India Bring Back Kl Rahul And Shreyas Iyer Tilak Varma Named In 17 Man Squad
Asia Cup 2023: 17 మందితో టీమ్, కేఎల్, శ్రేయస్, తిలక్ ఇన్
ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిల్ శర్మ నేతృత్వంలో 17 మందిని ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, తిలక వర్మ, సంజు శాంసన్‌కు జట్టులో చోటు కల్పించింది.
India bring back KL Rahul and Shreyas Iyer, Tilak Varma named in 17-man squad
Asia Cup 2023: ఆసియా కప్ (Asia Cup 2023) కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 17 మంది సభ్యులతో టీమ్‌ను ఖరారు చేసింది. రోహిల్ శర్మ కెప్టెన్‌గా.. హార్థిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. పాండ్యా కాక బూమ్రాకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ చివరికీ మేనెజ్ మెంట్ పాండ్యా వైపు చూసింది.
17 మందిలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారు. హైదరాబాదీ తిలక్ వర్మకు కూడా అవకాశం వచ్చింది. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన జట్టునే వరల్డ్ కప్‌కు సెలక్ట్ చేసే అవకాశం ఉంది. గాయాల నుంచి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రా కోలుకున్నారు. మహ్మద్ సమీ, మహ్మద్ సిరాజ్ కూడా జట్టులో ఉంటారు. సంజు సాంమ్సన్కు కూడా అవకాశం ఇచ్చారు.
జట్టు కూర్పు ఇలా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హర్థిక్ పాండ్యా (వైఎస్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రిత్ బూమ్రా, మహ్మద్ సమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ.