IND vs IRE: వర్షం ఎఫెక్ట్.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
ఐర్లాండ్ తో జరిగిన టీమిండియా(india vs ireland) సిరీస్ ని భారత్ కైవసం చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్ లు భారత్ విజయం సాధించింది. మూడో మ్యాచ్ తో క్లీన్ స్వీప్ చేయాలని అనుకున్నారు. కానీ, మూడో మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ రద్దు అయ్యింది.
ఐర్లాండ్ తో భారత్(india vs ireland) మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 2-0తో టీమ్ ఇండియా సొంతం చేసుకుంది. కెప్టెన్ గా జస్ ప్రీత్ బుమ్రాకు ఇది తొలి అంతర్జాతీయ సిరీస్ విక్టరీ కావడం విశేషం. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్లతో చర్చించి మ్యాచ్ ను రద్దు చేశారు. గతేడాది ఇరు జట్ల మధ్య జరిగిన టి20 సిరీస్ లో కూడా టీమిండియా విజేతగా నిలిచింది.
కాగా గాయం కారణంగా 11 నెలలు పాటు భారత జట్టుకు దూరమైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌తోనే పునరాగమనం చేశాడు. టీమిండియా టీ20 జట్టుకు అతడు తొలిసారి కెప్టెన్సీ వహించగా.. అతడి సారథ్యంలో తొలి సిరీస్‌నే భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా కైవసం చేసుకున్నాడు.
ఈ సిరీస్‌లో తొలి టీ20లో టీమిండియా డక్ వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలోనే గెలిచింది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించగా..డీఎల్ఎస్ మెథడ్‌లో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించగా.. ఐర్లాండ్ 7 వికెట్లకు 139 పరుగులకే పరిమితమైంది. తన పునరాగమనం తొలి ఓవర్లోనే భారత పేసర్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో టీమిండియా 47 పరుగుల వద్ద ఉండగా.. వర్షం వచ్చింది. దీంతో డీఎల్ఎస్ పద్ధతిలో ఈ మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం విశేషం.