ఇండియా, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ముగిసింది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ ప్రారంభం అయ్యింది. తొలి వన్డే గురువారం బ్రిడ్జ్‌టౌన్ లో ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్ లో వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనుంది. వన్డే మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.
వెస్ట్ ఇండీస్‌పై టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటిన భారత్ గురువారం వన్డే సిరీస్ ప్రారంభించనుంది. మరీ ఈ మ్యాచ్‌లోనన్న భారత్‌కు గట్టి పోటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
క్రికెట్ మ్యాచ్‌లలో బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు చేసే ఫీట్లు కొన్నిసార్లు నవ్వు తెప్పించడంతోపాటు తమ జట్టుకు అపార నష్టాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
యువరాజ్ సింగ్ కుటుంబానికి బెదిరింపు ఎదురయ్యాయి. గతంలో తమ ఇంట్లో పని చేసిన ఓ మహిళ 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్ట్ ఇండిస్‌పై భారత్ పై చేయి సాధించింది. ఇప్పటికే మొదటి టెస్టులో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో కూడా దూకుడు ప్రదర్శించింది. కానీ వర్షం కారణంగా గెలుపునకు అడ్డుకట్ట పడింది.
ఉమెన్స్ వన్డే క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తీరుతో ఐసీసీ ఆమెకు భారీ జరిమానాను విధించింది.
ఆసియా ఛాంపియన్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు ఆదివారం కొరియాలోని యోసులో జరిగిన కొరియా ఓపెన్ 2023 టైటిల్‌ను గెల్చుకున్నారు. 17-21, 21-13, 21-14తో 1 ఇండోనేషియా ద్వయం ఫజర్ అల్ఫియాన్, ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటోను ఓడించారు.
నేడు ఇండియా ఏ(India A) వర్సెస్ పాకిస్థాన్ ఏ(Pakistan A) ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు మొదలు కానుంది. సీనియర్ పురుషుల టీం ఆటగాళ్లు పాల్గొనే పోటీ కానప్పటికీ ఆ ఉత్సాహం మాత్రం అలాగే ఉంది. బ్లాక్‌బస్టర్ ఫైనల్ ఇరు జట్లు గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ మార్కును అందుకున్నాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 76వ అంతర్జాతీయ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఐదేళ్ల తర్వాత విదేశాల్లో టెస్టు సెంచరీ సాధించాడు.