2023 ఆసియా కప్ మొదలైన తరువాత మొదటి సారి ఇండియా పాకిస్థాన్ రెండు పెద్ద జట్లు శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. అయితే క్యాండీ జిల్లాలో ఈ రోజు వర్ష సూచన ఉండడంతో అభిమానలు ఆందోళన చెందుతున్నారు.
Asia Cup 2023 India Pakistan Cricket Match Rain Forecast
India Vs Pakistan: ఆసియా కప్ 2023(Asia Cup 2023) మొదలై మూడు రోజులు అవుతుంది. కానీ అసలు ఉత్కంఠ మ్యాచ్ రానే వచ్చింది. ఈ రోజు శ్రీలంకలోని క్యాండీ జిల్లా పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియం(Pallekele International Stadium)లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్(India-Pakistan Match) జరగబోతుంది. ఆసియా కప్లో ఈ రెండు జట్లు మొదటి సారి తలపడబోతున్నాయి. ప్రపంచ క్రికెట్ అభిమానలంతా టీవీల ముందు అతుక్కుపోనున్నారు. 2019లో మాంచెస్టర్లో ODI క్రికెట్లో తలపడిన ఈ ఇరు జట్లు మళ్లీ ఇన్నాళ్లకు పోటీ పడుతుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే స్టేడియంలో ఇరు జట్లు తలపడటానికి ముందు వర్షం వచ్చేలా ఉందని అంచనా వేస్తున్నారు.
నేపాల్లో జరిగిన టోర్నమెంట్లో అతిథ్య జట్టుపై 238 పరుగుల భారీ విజయంతో పాకిస్థాన్ 2023 ఆసియా కప్లో మంచి ఆరంభం చేసింది. భారత్-పాక్ పోరుకు వర్షం ముప్పుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. శ్రీలంకలో ఈ సమయంలో వర్షాలు(rains) మామూలే. మ్యాచ్ వేదికైన పల్లెకెలెలో శనివారం వర్షం పడే సంకేతాలున్నాయి. మొత్తం మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేకపోయినా..వర్షం వల్ల మ్యాచ్ సమయానికి మొదలు కాకపోవచ్చు. మ్యాచ్ మధ్యలో కూడా వరుణుడు అంతరాయం కలిగించవచ్చని అంటున్నారు. అయితే వర్షం ఇబ్బంది పెట్టినా.. మ్యాచ్ పూర్తయి ఫలితం వస్తే చాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరోవైపు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా(team india), పాకిస్థాన్(Pakistan)తో జరిగిన గత ఐదు ODI మ్యాచ్లలో నాలుగు గెలిచింది. ఈ ఫార్మాట్లో కూడా ఈ విజయాన్ని కొనసాగించాలని చూస్తుంది. ఓవరాల్గా, ODI క్రికెట్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన 132 ODIలలో 73 మ్యాచ్లు గెలిచి 55 ఓడిపోయింది.