వన్డే ప్రపంచ కప్ రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వేగవంతమైన శతకాన్ని చేశాడు. అంతేకాకుండా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా హిట్ మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.
వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విక్టరీని సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 273 పరుగుల లక్ష్యాన్ని 35 ఓవర్లలోనే సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 131 పరుగులతో విజృంభించాడు. విరాట్ కోహ్లీ 55 పరుగులు, ఇషాన్ కిషన్ 47 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Topping The Charts! 🔝
Most Hundreds (7️⃣) in ODI World Cups 🤝 Rohit Sharma
ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. మొదటి రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన రోహిత్ మూడో ఓవర్లోని రెండో బంతికి ఫోర్ కొట్టి పరుగుల వర్షాన్ని కురిపించాడు. 30 బంతుల్లోనే అర్థశతకాన్ని చేయడమే కాకుండా 63 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డేల్లో ఇది రోహిత్ శర్మకు 31వ శతకం కావడం విశేషం. ఈ శతకంతో వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు.
అంతేకాకుండా ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే 26వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడి భారత్‌కు విజయాన్ని అందించారు.