»India Vs Pakistan Heavy Rain In Kandy Hours Before Ind Vs Pak Spectacle Asia Cup 2023 Weather
IND vs PAK Weather Update: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి.. మైదానాన్ని కప్పి ఉంచిన నిర్వాహకులు
మ్యాచ్ కోసం భారత జట్టు హోటల్ నుంచి స్టేడియానికి చేరుకుంది. కానీ తాజా నివేదికల ప్రకారం, వర్షం కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. పిచ్, దాని పరిసరాలు చాలా వరకు కప్పబడి ఉన్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే టాస్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
IND vs PAK Weather Update: 2023 ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య మూడో మ్యాచ్ పల్లెకెలె వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్‌కు ముందు మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వర్షం మొదలైంది. దీని కారణంగా పిచ్ ను నిర్వాహకులు కప్పి ఉంచారు.
మ్యాచ్ కోసం భారత జట్టు హోటల్ నుంచి స్టేడియానికి చేరుకుంది. కానీ తాజా నివేదికల ప్రకారం, వర్షం కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. పిచ్, దాని పరిసరాలు చాలా వరకు కప్పబడి ఉన్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే టాస్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు కూడా వర్షం కారణంగా టీమ్ ఇండియా చాలా మ్యాచ్‌లు దెబ్బతిన్నాయి. 2023 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు స్టేడియంకు బయలుదేరింది. అది కూడా త్వరలోనే హోటల్ నుంచి స్టేడియానికి చేరుకుంటుంది. గత మ్యాచ్‌లో నేపాల్‌పై పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజం తుఫాను ఇన్నింగ్స్ తో పాక్ గెలుపునకు దోహద పడ్డాడు. బాబర్ 151 పరుగులు చేశాడు. కాగా, ఇఫ్తికార్ అహ్మద్ 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ బ్యాట్స్‌మెన్‌తో టీమ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలి. భారత బౌలింగ్ అటాక్‌కు వ్యతిరేకంగా ప్రత్యేక వ్యూహాలతో పాక్ ఆటగాళ్లు మైదానంలో ఇండియన్ బౌలర్లను ఢీకొట్టవచ్చు. ప్రపంచ కప్ 2019 తర్వాత తొలిసారిగా భారత్-పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు జట్లు చాలా కాలం తర్వాత ఒకరిపై ఒకరు మైదానంలోకి దిగనున్నారు. మ్యాచ్‌కు ముందు టీమిండియా, పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచ్ లో తలపడ్డారు.