భారత యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్ ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లో భారత మిడిలార్డర్‌లో రాణిస్తాడు అనుకుంటున్న తరుణంలో తన బ్యాటింగ్ తీరుపై మాజీ సెలెక్టర్ సబా కరీం, భారత మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ కీలక సూచనలు చేశారు.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓటమి నుంచి గుణపాఠం తీసుకున్న భారత జట్టు మూడో వన్డే(3rd odi)లో 200 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. చివరి మ్యాచులో టీమ్ ఇండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ముఖేష్ కుమార్(mukesh kumar) తన స్వింగ్ బౌలింగ్ తో ఇండియా జట్టు విజయానికి కీలక సపోర్ట్ నిచ్చాడు.
శనివారం జరిగిన రెండో వన్డేలో ఓటమి నుంచి పుంజుకుని ఆతిథ్య వెస్టిండీస్‌పై మంగళవారం జరగనున్న మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా సిరీస్ విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. మొదటి వన్డేలో భారత్ గెలుపొందగా, వెస్టిండీస్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
బుమ్రా, రిషబ్ పంత్ జాతీయ జట్టుకు దూరం అవడంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు నేషనల్ టీమ్‌కు ఆడితే జట్టు పరిస్థితి మరోలా ఉంటుందని తెలిపారు.
వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. మొదటి మ్యాచ్ దిగ్విజయంగా గెలిచిన భారత్ రెండో వన్డేలో తడబడింది. స్వల్ప స్కోరుకు మాత్రమే పరిమితమైంది. దీంతో వెస్టిండీస్ జట్టు అలవోకగా గెలిచింది.