విరాట్ కోహ్లీ ఆ రోజు మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ వద్దకు వెళ్లి అతనిని కౌగిలించుకుని కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత నవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్‌ను కూడా కలుసుకున్న కోహ్లి అతనితో కొద్ది క్షణాలు గడిపాడు
Virat Kohli: సాధారణంగా క్రికెట్ మైదానంలో భారత్ పాక్ లను బద్ధ శత్రువులుగా భావిస్తారు. 2023 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ తలపడినప్పుడు ఆ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ ఫోటో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో విరాట్ కోహ్లీ పాకిస్థాన్ ఆటగాళ్లతో సరదాగా గడుపుతున్నాడు. విరాట్ కోహ్లీకి పాకిస్థానీ ఆటగాళ్లతో మంచి స్నేహం ఉంది . ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడ్డా వారి మధ్య స్నేహం తరచుగా కనిపిస్తుంది. ఇదే ప్రస్తుతం విరాట్ కోహ్లీకి కష్టాలు తెచ్చి పెట్టింది. ఆయన వైఖరి కొందరికి అసలు నచ్చడం లేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, ఆసియాకప్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ ఓ విషయం చెప్పాడు.
వాస్తవానికి విరాట్ కోహ్లీ ఆ రోజు మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ వద్దకు వెళ్లి అతనిని కౌగిలించుకుని కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత నవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్‌ను కూడా కలుసుకున్న కోహ్లి అతనితో కొద్ది క్షణాలు గడిపాడు. ఇది మాత్రమే కాదు, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ రౌఫ్‌తో పల్లెకెలె పిచ్ గురించి మాట్లాడాడు. దీనిపై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ మా టైంలో ఇలా ప్రత్యర్థి ఆటగాళ్లను కౌగిలించుకోవడం, వారి భుజాలపై చేతులు వేసుకోవడం జరిగేది కాదని తెలిపాడు. మ్యాచ్ సమయంలో ఆటగాడి కళ్లలో దూకుడు ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో సదరు క్రికెటర్ దేశ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గెలుపు గురించి ఆలోచించాలి. ఆ మ్యాచ్ జరిగే 6-7 గంటలు చాలా ముఖ్యమైనవని గంభీర్ అన్నాడు. ఆ సమయంలో టీమ్ ఇండియా జెర్సీని ధరించడమే కాదు.. 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
విరాట్ తప్పు చేశాడా?
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. విరాట్ కోహ్లీ పాక్ ఆటగాళ్లతో జోక్ చేసి తప్పు చేశాడా? గంభీర్ తన వైఖరిని నిలదీస్తున్నాడా? చాలా మంది పాకిస్థాన్ ఆటగాళ్లు విరాట్‌ను తమ ఆరాధ్యదైవంగా భావిస్తారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం స్వయంగా విరాట్ వీడియోలను చూసి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని బాబర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
పాకిస్థాన్‌పై విరాట్ ఓటమి
విరాట్ కోహ్లి పాకిస్థాన్‌పై ఫ్లాప్ అయ్యాడు. ఈ ఆటగాడు కేవలం 4 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. అతని వికెట్‌ను షాహీన్ అఫ్రిది తీశాడు. విరాట్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్లు కూడా పాకిస్థాన్‌పై ఏమీ చేయలేకపోయారు. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా 266 పరుగులకు చేరుకుంది. అయితే ఆ తర్వాత వర్షం కురవడంతో ఆ మ్యాచ్ రద్దయింది.