రాబోయే ODI ప్రపంచ కప్ 2023(odi world cup 2023) కోసం భారత్ జట్టు ఫైనల్ ఆటగాళ్లను బీసీసీఐ(BCCI) అనౌన్స్ చేసింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు చోటు లభించిందని బీసీసీఐ సెలెక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ తెలిపారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా 15 మంది సభ్యుల బృందాన్ని ఈ మేరకు ఖరారు చేసింది. అయితే ఈ జట్టులో సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజాలకు అవకాశం దక్కలేదు. దీంతోపాటు తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, సంజూ శాంసన్‌లకు ఛాన్స్ దొరకలేదు. ఈ ముగ్గురిని రిజర్వ్ స్టాండ్-బై ప్లేయర్లుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
2023 ODI క్రికెట్ ప్రపంచ కప్ 13వ ఎడిషన్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19, 2023 వరకు ఇండియా(india)లో పలు ప్రాంతాల్లో జరగనుంది. 50 ఓవర్ల ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్..అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మొదలు కానుంది. అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియాతో తలపడనుంది. కీలక మ్యాచ్ అయిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.